Narendra Modi : ఫాంహౌస్ సీఎంను ఇంటికి పంపాల్సిందే

ఫాం హౌస్ ముఖ్యమంత్రికి మరోసారి అధికారమిస్తారా? అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు.

Update: 2023-11-27 08:07 GMT

ఫాం హౌస్ ముఖ్యమంత్రికి మరోసారి అధికారమిస్తారా? అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. మహబూబాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. తెలంగాణకు ఫాం హౌస్ సీఎం అవసరం లేదన్నారు. తెలంగాణాలో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించబోతుందన్నారు. ఎన్డీఏలో చేర్చుకోకపోవడంతోనే తనను బీఆర్ఎస్ నేతలు తిట్టడం మొదలుపెట్టారన్నారు. బీఆర్ఎస్ చేసిన స్కామ్ లన్నింటిపై తాము దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారని మోదీ అన్నారు. తెలంగాణకు వచ్చే ముఖ్యమంత్రి బీజేపీ నుంచే వస్తున్నారన్నారు. తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండదలచుకోలేదన్నారు.

తాము ఎన్డీఏలో చేర్చుకోవడానికి...
తాము ఎన్డీఏ దరిదాపుల్లోకి కూడా బీఆర్ఎస్ ను రానివ్వబోమని తెలిపారు. అవినీతి చేసిన వారిని ఎవరినీ వదలిలపెట్బబోమన్న మోదీ ల్యాండ్, లిక్కర్, శాండ్ మాఫియాలను జైలుకు పంపుతామని తెలిపారు. తెలంగాణకు బీసీకి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించిందన్నారు.కేసీఆర్ కు బీజేపీ శక్తి ఏంటో అర్థమయిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అవినీతిలో కూరుకుపోయిన పార్టీలన్నారు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగులను మోసం చేసిందన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఒక్కటేనని మోదీ ధ్వజమెత్తారు.


Tags:    

Similar News