రాష్ట్రానికి జగన్ శనిలా దాపురించారు

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. కరోనా బాధితులను ఆదుకోవడంలోనూ జగన్ రెడ్డి విఫలమయ్యారని [more]

Update: 2021-06-29 05:42 GMT

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. కరోనా బాధితులను ఆదుకోవడంలోనూ జగన్ రెడ్డి విఫలమయ్యారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరిలో ఈరోజు ప్రారంభమయిన సాధన దీక్షలో అచ్చెన్నాయుడు ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. జగన్ కరోనాను తేలిగ్గా తీసుకోబట్టే వేలాది మంది మరణించారని అచ్చెన్నాయుడు అన్నారు. తాము బాధ్యతగల ప్రతిపక్షంగా ఎన్ని సలహాలు ఇచ్చిని మూర్ఖపు సీఎం పట్టించుకోలేదన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ బయటకు రాలేదని అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు. ఈ రాష్ట్రానికి జగన్ శనిలా దాపురించారని ఆయన చెప్పారు.

Tags:    

Similar News