ఉంటే సభలో…లేకుంటే చేలో

తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నానని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికార వికేంద్రీకరణకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. [more]

Update: 2020-01-20 09:46 GMT

తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నానని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికార వికేంద్రీకరణకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. తనకు రాజకీయ భవిష్యత్ ఉన్నా లేకపోయినా జగన్ వెంటే ఉంటానని చెప్పారు. రాజకీయాల్లో ఉంటే సభలో ఉంటానని, లేకుంటే తన చేలో ఉంటానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. తనకు భవిష్యత్తులో ఏదో పదవులు వస్తాయని తాను మద్దతు తెలపడం లేదన్నారు. ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్ కు, అనంతపురం నుంచి బెంగళూరుకు పొట్టకూటి కోసం వలసలు పోతుంటే, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఇతర దేశాలకు వెళుతున్నారన్నారు. విమానాలను, రైైళ్లను చూడని ప్రాంతాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయన్నారు. వారికి సంక్షేమ ఫలాలు దక్కాలన్నదే తన ఉద్దేశ్యమని ఆళ్ల తెలిపారు.

Tags:    

Similar News