అమరావతిలో ఆగని ఆందోళనలు

అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డులో అర్థనగ్న ప్రదర్శన చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికకు వ్యతిరేకంగా రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. [more]

;

Update: 2019-12-21 04:16 GMT

అమరావతిలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డులో అర్థనగ్న ప్రదర్శన చేస్తున్నారు. జీఎన్ రావు కమిటీ నివేదికకు వ్యతిరేకంగా రాజధాని రైతులు ఆందోళనకు దిగారు. మందడంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్లు, బండ్లు అడ్డం పెట్టి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టుకు వెళ్లే దారిలో వంటా వార్పు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 27న జరగనున్న ఏపీ కేబినెట్ లో అమరావతిని రాజధానిలోనే ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టవద్దని రైతులు కోరుతున్నారు. రోడ్లపైనే టైర్లు కాల్చి తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News