ఆ విష‌యం చంద్ర‌బాబుకూ తెలుసు

లంచాలు దండుకోవ‌డం వ‌ల్లె అమ‌రావ‌తి నిర్మాణాల్లో నాణ్య‌త లోపించింద‌ని వైసీపీ నేత అంబ‌టి రాంబాబు ఆరోపించారు. నిన్న ఈదురుగాలుల‌కు అమ‌రావ‌తిలో తాత్కాలిక స‌చివాల‌యంలో ప‌లు నిర్మాణాలు దెబ్బ‌తిన‌డంపై [more]

;

Update: 2019-05-08 08:34 GMT

లంచాలు దండుకోవ‌డం వ‌ల్లె అమ‌రావ‌తి నిర్మాణాల్లో నాణ్య‌త లోపించింద‌ని వైసీపీ నేత అంబ‌టి రాంబాబు ఆరోపించారు. నిన్న ఈదురుగాలుల‌కు అమ‌రావ‌తిలో తాత్కాలిక స‌చివాల‌యంలో ప‌లు నిర్మాణాలు దెబ్బ‌తిన‌డంపై ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అమ‌రావ‌తిలో అడుగ‌డుగునా అవినీతి చేశార‌ని, విచ్చ‌ల‌విడిగా క‌మీష‌న్లు తీసుకున్నార‌ని, అందుకే నిర్మాణాల్లో నాణ్య‌త లేద‌ని ఆరోపించారు. ఈవీఎంల‌పై చంద్ర‌బాబు విచిత్ర‌మైన వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని, గ‌తంలో ఈవీఎంల‌పై ఆయ‌న‌కు లేని అనుమానాలు ఇప్పుడు ఎందుకు వ‌స్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబుకు ఓట‌మికి ముందే కార‌ణాలు వెతుక్కుంటున్నారని, ఈవీఎంలపై నేపం నెట్టేస్తార‌ని పేర్కొన్నారు. 23 త‌ర్వాత సీఎంగా ఉండ‌ర‌ని చంద్ర‌బాబుకు బాగా తెలుస‌న్నారు. పంతాల కోసం చంద్ర‌బాబు కేబినెట్ భేటీ పెడుతున్నార‌ని అన్నారు. స్పీక‌ర్ కోడెల త‌న ఛాంబ‌ర్ ప్రెస్ మీట్ పెట్టి రాజ‌కీయ అంశాలు మాట్లాడ‌టం ఎన్నిక‌ల కోడ్ ను ఉల్లంఘించిన‌ట్లే అవుతుంద‌న్నారు

Tags:    

Similar News