వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి
గత ఎన్నికల్లో ఈవీఎంల మీదే గెలిచిన చంద్రబాబు, ఈసారి ఓడిపోతున్నారని తెలిసి ఈవీఎంల మీద నేపం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు [more]
;
గత ఎన్నికల్లో ఈవీఎంల మీదే గెలిచిన చంద్రబాబు, ఈసారి ఓడిపోతున్నారని తెలిసి ఈవీఎంల మీద నేపం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు [more]
గత ఎన్నికల్లో ఈవీఎంల మీదే గెలిచిన చంద్రబాబు, ఈసారి ఓడిపోతున్నారని తెలిసి ఈవీఎంల మీద నేపం నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఏ నాయకుడూ చేయలేని ఆలోచనలు చంద్రబాబు చేస్తున్నారని, కౌంటింగ్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టించేందుకు చంద్రబాబు ముఠా ప్రయత్నిస్తోందన్నారు. వైసీపీ శ్రేణులు చంద్రబాబు ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చంద్రబాబుకు ఆయనపైనే ఆయనకు విశ్వాసం లేదన్నారు. వ్యవస్థలను అన్నింటినీ చంద్రబాబు బ్రష్టుపట్టిస్తున్నారని అన్నారు. ప్రతీ ఎన్నికకూ పోలింగ్ శాతం పెరుగుతుందని, దానిని కూడా తన పిలుపు వల్లే ఓటేవారని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబుపై వ్యతిరేకతతోనే ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. చంద్రబాబు ఏ విషయాన్నీ, ఎగ్జిట్ పోల్స్ ను నమ్మడం లేదని, కనీసం ఫలితాలు వచ్చాక అయినా నమ్ముతారా అని ప్రశ్నించారు. కష్టం వచ్చినప్పుడు, ఓడిపోయినప్పుడు హుందాగా ఉంటేనే గౌరవం పెరుగుతుందని, చంద్రబాబు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.