జగన్ హిందూ వ్యతిరేకి అంటూ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకిగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. అమెరికాలో పర్యటిస్తున్న ఒక కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని [more]
;
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకిగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. అమెరికాలో పర్యటిస్తున్న ఒక కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని [more]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకిగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. అమెరికాలో పర్యటిస్తున్న ఒక కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని కొందరు టీడీపీ, బీజేపీ నేతలు వితండవాదం చేస్తున్నారు. అక్కడ జగన్ విద్యుత్తు దీపాన్ని వెలిగించిన విషయాన్ని మర్చిపోతున్నారన్నారు. కమలదళంలోని పచ్చ పుష్పాలు కొన్ని ఈ రాద్ధాంతం చేస్తున్నాయని అంబటి రాంబాబు చెప్పారు. సదావర్తి భూములను అమ్మేసుకుంటున్నప్పుడు చంద్రబాబు హిందూ వ్యతిరేకిగా కనపడలేదా? అని అంబటి ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ తాను ఆలయంలో పూజారిలాంటి వారినని చెప్పుకొచ్చారని, కానీ గుళ్లో లింగాన్ని సయితం మింగేసేలా కోడెల వ్యవహరించారని అంబటి ఎద్దేవా చేశారు.