అమరావతి లో భారీగా పోలీసుల మొహరింపు
మూడు రాజధానుల బిల్లులకు వ్యతిరేకంగా అమరావతి జేఏసీ ఆందోళనకు పిలుపు నిచ్చింది. జేఏసీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కూడా ఆందోళనలను చేపట్టింది. రాజధానిని అమరావతిని కొనసాగించాలని [more]
మూడు రాజధానుల బిల్లులకు వ్యతిరేకంగా అమరావతి జేఏసీ ఆందోళనకు పిలుపు నిచ్చింది. జేఏసీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కూడా ఆందోళనలను చేపట్టింది. రాజధానిని అమరావతిని కొనసాగించాలని [more]
మూడు రాజధానుల బిల్లులకు వ్యతిరేకంగా అమరావతి జేఏసీ ఆందోళనకు పిలుపు నిచ్చింది. జేఏసీ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ కూడా ఆందోళనలను చేపట్టింది. రాజధానిని అమరావతిని కొనసాగించాలని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. జగన్ అసెంబ్లీలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. విశాఖలో తమ భూముల విలువను పెంచుకోవడం కోసమే రాజధానిని విశాఖకు మారుస్తున్నారని ఆరోపించారు. రాజధాని ఉద్యమంలో 70 మంది రైతులు గుండె ఆగి మరణించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ నేతలు తమ పార్టీ కార్యాలయాల్లోనే నిరసనలకు దిగారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్దయెత్తున పోలీసులు మొహరించారు. మూడు రాజధానుల బిల్లు ఆమోదం పొందడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను మొహరించారు.