బ్రేకింగ్ : ఈ నెల 20న ఏపీ అసెంబ్లీ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలుఈనెల 20వ తేదీన జరగనున్నాయి. ఈ మేరకు అధికారికంగా అసెంబ్లీ కార్యదర్శి సమాచారం ఇచ్చారు. ఈ నెల 20వ తేదీన జరగబోయే అసెంబ్లీ సమావేశంలో [more]

;

Update: 2020-01-13 12:21 GMT
ప్రివిలేజ్ కమిటి
  • whatsapp icon

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలుఈనెల 20వ తేదీన జరగనున్నాయి. ఈ మేరకు అధికారికంగా అసెంబ్లీ కార్యదర్శి సమాచారం ఇచ్చారు. ఈ నెల 20వ తేదీన జరగబోయే అసెంబ్లీ సమావేశంలో రాజధాని అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ఇచ్చిన నివేదికలతోపాటు హైపవర్ కమిటీ కూడా ఇచ్చిన సూచనలను సభ ముందు ఉంచనున్నారు. ఇప్పటికే విశాఖలో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ ప్రతిపాదనను ముఖ్యమంత్రి జగన్ గత అసెంబ్లీ సమావేశంలో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. 20వ తేదీన జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుని సభ ఆమోదం పొందే అవకాశం ఉంది. 21వ తేదీన శాసనమండలి సమావేశం జరగనుంది.

Tags:    

Similar News