బ్రేకింగ్ : లైవ్ కట్ చేశారని మండలిలో?

శానసమండలి వాయిదా పడింది. వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. శాసనమండలిలో లైవ్ ప్రసారాలు ఇవ్వకపోడంపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. లైవ్ [more]

Update: 2020-01-22 05:46 GMT

శానసమండలి వాయిదా పడింది. వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. శాసనమండలిలో లైవ్ ప్రసారాలు ఇవ్వకపోడంపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. లైవ్ ప్రసారాలు ఇచ్చేంతవరకూ సభను జరగనివ్వమని టీడీపీ పట్టుబట్టింది. సభలో మాట్లాడేది టీవీలో కనపడటానికా? లేక రాష్ట్ర పరిస్థితులపై ప్రసంగించడానికా? అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ, పీడీఎఫ్, టీడీపీలు లైవ్ ప్రసారాలను నిలిపివేయడంపై అభ్యంతరాలు తెలిపారు. సభలో పీడీఎఫ్ కు ఏడుగురు సభ్యులున్నారు. దీంతో సభను ఛైర్మన్ పదిహేను నిమిషాలు పాటు వాయిదా వేశారు.

Tags:    

Similar News