బ్రేకింగ్: టీడీపీకి మరో అభ్యర్థి షాక్
తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో మరో షాక్ తగిలింది. ఇప్పటికే శ్రీశైలం అభ్యర్థిగా టిక్కెట్ ఖరారైన తర్వాత బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు [more]
;
తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో మరో షాక్ తగిలింది. ఇప్పటికే శ్రీశైలం అభ్యర్థిగా టిక్కెట్ ఖరారైన తర్వాత బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు [more]
తెలుగుదేశం పార్టీకి కర్నూలు జిల్లాలో మరో షాక్ తగిలింది. ఇప్పటికే శ్రీశైలం అభ్యర్థిగా టిక్కెట్ ఖరారైన తర్వాత బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు బనగానపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి కూడా అదే బాటలో ఉన్నారు. ఆయనకు మళ్లీ టిక్కెట్ ఖారారైనా ప్రచారం చేయడం లేదు. పోటీ నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో ఇటీవల మారిన రాజకీయ సమీకరణలతో బీసీ జనార్ధన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరి బీసీ విజయానికి కృషి చేసిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణరెడ్డి తాజాగా వైసీపీలో చేరారు. నియోజకవర్గంలో కాటసాని, చల్లా కుటుంబాలు ఒకటి కావడంతో వైసీపీ బాగా బలం పుంజుకుంది. దీంతో పోటీ చేసి ఓడిపోవడం ఎందుకనే భావనలో ఆయన పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.