ఇక ఏపీకి వెళ్లాలంటే అనుమతి అవసరం లేదు

రేపటి నుంచి తెలంగాణ, ఏపీల మధ్య రాకపోకలకు ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతరాష్ట్రాల మధ్య రాకపోకలపై నిషేధాన్ని కేంద్ర [more]

;

Update: 2020-06-07 06:54 GMT

రేపటి నుంచి తెలంగాణ, ఏపీల మధ్య రాకపోకలకు ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతరాష్ట్రాల మధ్య రాకపోకలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసినా కరోనా కేసుల సంఖ్య దృష్ట్యా చెక్ పోస్టుల వద్ద ఏపీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ పరీక్షలు నిర్వహించిన అనంతరమే వారిని ఏపీకి పంపుతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెక్ పోస్టులను ఎత్తివేసింది. దీంతో ఏపీ సర్కార్ కూడా సోమవారం నుంచి తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను తొలగిస్తున్నట్లు పేర్కొంది.

Tags:    

Similar News