నీటి పంపకాలపై తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఉమ్మడి ప్రాజెక్టుల ద్వారా 70 : 30 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపిణీ జరగాలని [more]

Update: 2021-08-25 07:40 GMT

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఉమ్మడి ప్రాజెక్టుల ద్వారా 70 : 30 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపిణీ జరగాలని కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలు ప్రాజెక్టుల వారీగా చేపట్టలేదని తెలిపింది. 50 : 50 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ ప్భుత్వం కోరుతునన సంగతి తెలిసిందే. తెలంగాణ లేఖపై ఏపీ అభిప్రాయం కోరగా ఈ మేరకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. చెన్నై, హైదరాబాద్ కు తాగునీటి విషయంలోనే నిబంధనలున్నాయని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖలో పేర్కొంది. నాగార్జున సాగర్ లో నీటి ఉత్పత్తి, కృష్ణా బరాజ్ కు నీటి సరఫరా విషయంలోనే కొన్ని నిర్ణయాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News