ఒవైసీకి z ఎందుకట?

ఆర్టీసీ సమ్మె 30 రోజులుగా తెలంగాణలో జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఆర్టీసీ సమ్మెపై ఎంఐఎం నేతలు స్పందించలేదు. తాజాగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆర్టీసీ [more]

Update: 2019-11-03 05:45 GMT

ఆర్టీసీ సమ్మె 30 రోజులుగా తెలంగాణలో జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఆర్టీసీ సమ్మెపై ఎంఐఎం నేతలు స్పందించలేదు. తాజాగా ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆర్టీసీ సమ్మెపై మాట్లాడారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలా? లేదా? అన్నది కేసీఆర్ ఇష్టమని, అయితే ఆర్టీసీ నెంబర్ ప్లేట్ లో ఉన్న z ను తొలగించవద్దని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. z అక్షరాన్ని ఒవైసీ ఎందుకు తొలగించవద్దని కోరారన్నది చర్చనీయాంశమైంది.

నిజాం నవాబు……

నిజాం ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ ఏర్పడింది. తెలంగాణాలో అతి పెద్ద రవాణా సంస్థగా ఆవిర్భవించింది. నాడు ఏడో నిజాం నవాబు తన తల్లి జహ్రా బేగం పేరిట సిరీస్ లో z అక్షరాన్ని పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ z అక్షరాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఆర్టీసీలో సంస్కరణలను తీసుకొస్తున్న సందర్భంగా z అక్షరాన్ని తొలగిస్తారేమోనన్న ఆలోచనతోనే అసదుద్దీన్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఆర్టీసీ సమ్మె పై కంటే z అక్షరంపైనే అసద్ కు ప్రేమ ఎక్కువగా ఉన్నట్లుంది. నిజాం సెంటిమెంట్ తోనే అసద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News