తొలిసారి స్పందించిన అశోక్ గజపతి

మాన్సాస్ ట్రస్ట్ నుంచి తనను తొలిగించడంపై మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ వైఖరి వింతగా ఉందన్నారు. ఈ అంశంపై అశోక్ [more]

Update: 2020-03-07 04:48 GMT

మాన్సాస్ ట్రస్ట్ నుంచి తనను తొలిగించడంపై మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ వైఖరి వింతగా ఉందన్నారు. ఈ అంశంపై అశోక్ గజపతిరాజు తొలిసారి స్పందించారు. ఆయన మీడియాతో మట్లాడారు. ట్రస్ట్ విషయంలో ప్రభుత్వ జోక్యం సరికాదని అశోక్ గజపతి రాజు తెలిపారు. ఇప్పటి వరకూ జీవోను ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. వేరే మతం వారిని ఇందులో నియమిస్తే సమస్యలు వస్తాయని అశోక్ గజపతిరాజు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతోనే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ట్రస్ట్ దేవాలయ భూములపై ప్రభుత్వం కన్నేసిందని ఆయన ఆరోపించారు. ఇలా చేస్తే ఎవరైనా డబ్బున్న వాళ్లు ట్రస్ట్ పెట్టేందుకు ముందుకు వస్తారా? అని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. ఇప్పటికే పరిశ్రమలు వెనక్కు వెళ్లిపోతున్నాయని అన్నారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాలన్నా జీవో బయటపెట్టడం లేదన్నారు. దాతల భూములు ఆలయాలకే చెందాలన్నారు. 1958 లోనే మాన్సాస్ ట్రస్ట్ ఏర్పడిందన్నారు. తనను తొలగిస్తున్నట్లు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్పారు. ఇంతటి అరాచక ప్రభుత్వాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు.

Tags:    

Similar News