హిందువులను బిచ్చగాళ్లగా చేసే కుట్ర
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు వివాదమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. శాశ్వత ట్రస్టీలను కాదని బెయిల్ పై వచ్చిన [more]
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు వివాదమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. శాశ్వత ట్రస్టీలను కాదని బెయిల్ పై వచ్చిన [more]
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు వివాదమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. శాశ్వత ట్రస్టీలను కాదని బెయిల్ పై వచ్చిన దొంగలకు పదవులు కట్టబెడతారా? అని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. తనను ట్రస్ట్ ఛైర్మన్ గా తప్పించి అప్పన్న ప్రసాదం ధరలను పెంచారన్నారు. ధర్మకర్తల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సింహాచలం భూములు తీసుకుని ఎక్కడో అడవుల్లో ఇస్తారా అని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు. ఏపీలో హిందువులను బిచ్చగాళ్లను చేసే కుట్ర జరుగుతుందన్నారు. భక్తుల సొమ్మును 49 లక్షల రూపాయలను ప్రభుత్వం వాహనమిత్ర పథకం కోసం వినియోగించిందని అశోక్ గజపతిరాజు ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి నోటి నుంచి బూతులు రావడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.