మాజీ మంత్రి కాల్వపై దాడి

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై దాడి జరిగింది. రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై అధికారులతో కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతుండగా వైసీపీ కార్యకర్తలు వచ్చి [more]

;

Update: 2020-03-14 14:28 GMT

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులపై దాడి జరిగింది. రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీనిపై అధికారులతో కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతుండగా వైసీపీ కార్యకర్తలు వచ్చి దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని కాల్వ శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. పోలీసులు జోక్యంతో కాల్వ శ్రీనివాసులను సురక్షితంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాల్వపై దాడి జరిగిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News