జగన్ పై హత్యాయత్నం కేసులో ఏపీ స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం వేగం పెంచింది. జగన్ పై హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాస్ సోదరి విజయలక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ వద్ద లభించిన లేఖ సోదరి విజయలక్ష్మి కొంత భాగం రాసినట్లు గుర్తించారు. అయితే విజయలక్ష్మి మైనర్ కావడంతో పోలీసులు ఈరోజు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే లేఖలో మరికొంత భాగం రాసిన పలాసకు చెందిన రేవతీపతి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ఆరు నెలల కాలంలో దాదాపు పది సెల్ ఫోన్లు మార్చడంపైన కూడా వీరిని విచారించనున్నట్లు తెలుస్తోంది. విశాఖ పట్నం ఎయిర్ పోర్ట్ లో జగన్ పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ ను నిన్ననే పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.