పన్నెండేళ్ల తర్వాత రీపోస్ట్ మార్టం

తెనాలి చెంచుపేట ఈద్గాలో, ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేస్తున్నారు. తెనాలి రెవెన్యూ అధికారులతో కలిసి , సిబిఐ దర్యాప్తు బృందం, రీ పోస్టుమార్టం వీడియో తీసి [more]

Update: 2019-12-14 04:35 GMT

తెనాలి చెంచుపేట ఈద్గాలో, ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం చేస్తున్నారు. తెనాలి రెవెన్యూ అధికారులతో కలిసి , సిబిఐ దర్యాప్తు బృందం, రీ పోస్టుమార్టం వీడియో తీసి కోర్టుకు సమర్పించాలని సిబిఐ ఇప్పటికే ఆదేశించింది.12 ఏళ్ల క్రితం లైంగిక దాడికి, హత్యకు గురైన ఆయేషా కేసు పలు మలుపులు తిరుగుతూ వచ్చింది. అప్పటి పోలీసులు, డిఎన్ఏ, అందించిన ఆధారాలు , అసలు ఆయేషా కు సంబంధించినవేనా అనే అనుమానం సిబిఐ కి వచ్చింది. ఇక ఈ కేసులో సత్యంబాబును, హాస్టల్ వార్డెన్ పద్మ భర్త శివరామకృష్ణ ను హై కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఆయేషా తల్లి బేగం, కేసులో ప్రధాన నిందితులు, కోనేరు సతీష్ అబ్బూరి గణేష్, చింత పవన్ , సురేష్ , రాజేష్ , ఉన్నారని ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం మా మత ఆచారాల విరుద్ధం అయినప్పటికీ , కేసు ముందుకు సాగేందుకు అంగీకరించామని తల్లి ద్ బేగం తెలిపారు.

సీబీఐ వేగం పెంచి….

12 ఏళ్ల తర్వాత ఆయేషా మీరా హత్యకేసులో సీబీఐ వేగం పెంచింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత తన కుమార్తెకు కూడా ఇలా న్యాయం జరగాలని ఆయెషామీరా తల్లి కోరిన విషయం తెలిసిందే. కొత్తగా దిశ చట్టాన్ని అమలు పరచడంలో ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆయేషా మీరా హంతకులను పట్టుకుని చట్టం ముందు శిక్షించే క్రమంలో సీబీఐ దూకుడు పెంచింది. ఆయేషా మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించింది. మృతదేహాన్ని పూడ్చిపెట్టి 12 ఏళ్లు అయిన నేపథ్యంలో ఎముకలు మాత్రమే ఉంటాయని, వాటికి పోస్టుమార్టం నిర్వహిస్తే ఒంటికి తగిలిన గాయాలు తెలుస్తాయని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆయేషా తల్లిదండ్రుల వద్ద డీఎన్ఏ‌ను కూడా సేకరించారు అధికారులు.

Tags:    

Similar News