దత్తన్నకు ఆ ఛాన్స్ ఎందుకంటే?

మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆయనకు గవర్నర్ పదవి ఇస్తామని కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించేటప్పుడే బీజేపీ అధినాయకత్వం హామీ [more]

Update: 2019-09-01 09:58 GMT

మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆయనకు గవర్నర్ పదవి ఇస్తామని కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించేటప్పుడే బీజేపీ అధినాయకత్వం హామీ ఇచ్చింది. 2014లో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిచిన దత్తాత్రేయకు మోదీ తన తొలి క్యాబినెట్ లో స్థానం కల్పించారు. అయితే మధ్యలో విస్తరణ సమయంలో ఆయనను తొలగించారు. ఆ సమయంలోనే దత్తాత్రేయకు గవర్నర్ గా పంపుతామని మోదీ, అమిత్ షా హామీ ఇచ్చారు. అందుకే 2019 ఎన్నికల్లో దత్తాత్రేయకు ఎంపీ టిక్కెట్ కూడా ఇవ్వలేదు. మోదీ, షా తమ మాట నిలుపుకున్నారని దత్తాత్రేయ సన్నిహితులు అంటున్నారు.

Tags:    

Similar News