చంద్రబాబు కోసం మత్తేభాల ఢీ!

మంగళవారం ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో, సీబీఐ కోర్టులో చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్లు విచారణకు వస్తున్న క్రమంలో దేశంలోనే పేరున్న పెద్ద లాయర్లు ఇద్దరు ఢీ కొనబోతున్నారు. భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ గా పనిచేసిన హరీష్ సాల్వే టీడీపీ అధినేత తరఫున వాదనలు వినిపించనున్నారు.;

Update: 2023-09-19 06:15 GMT
chandrababu, tdp chief, bail, high court, reserved, verdict
  • whatsapp icon

మంగళవారం ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ లో, సీబీఐ కోర్టులో  చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్లు విచారణకు వస్తున్న క్రమంలో దేశంలోనే పేరున్న పెద్ద లాయర్లు ఇద్దరు ఢీ కొనబోతున్నారు. భారత ప్రభుత్వ అటార్నీ జనరల్ గా పనిచేసిన  హరీష్ సాల్వే టీడీపీ అధినేత తరఫున వాదనలు వినిపించనున్నారు. ఇటీవలే మూడో పెళ్లితో మీడియా దృష్టిని ఆకర్షించిన సాల్వే, ప్రస్తుతం లండన్ లో ఉన్నారు. ఆయన ఆన్లైన్ లో తన  వాదనలు వినిపిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ తరఫున మరో ప్రముఖ లాయర్, మాజీ సొలిసిటర్ జనరల్ ముకుల్ రోహత్గి  రంగంలో దిగుతున్నారు.

ఇప్పటివరకు ఈ కేసుని సీఐడీ తరపున ఆంధ్ర ప్రదేశ్ అడిషనల్ జనరల్  పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదించిన విషయం తెలిసిందే. గత తొమ్మిది రోజుల్లో జరిగిన కోర్ట్ వ్యవహారాల్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి సిఐడి తరఫున పై చేయి సాధించారు. ఇప్పుడు చంద్రబాబుకి ఎలాగైనా బెయిల్ తెప్పించాలని దృఢ నిశ్చయంతో సిద్ధార్థ లూథ్రా, మరో ప్రముఖ లాయర్ సిద్ధార్థ అగర్వాల్ తో పాటు హరీష్ సాల్వే కూడా రంగంలో దిగనున్నారు.  పొన్నవోలుతో పాటు ముకుల్ రోహత్గి కూడా సీఐడీకి బాసటగా నిలవనున్నారు. మంగళవారమే హై కోర్ట్ లో, సీబీఐ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ల తో పాటు, సీఐడీ అడుగుతున్న చంద్రబాబు కస్టడీ పిటిషన్ కూడా విచారణకు రానున్నాయి.

Tags:    

Similar News