ఇదేంటి.. కాంగ్రెస్ కు బీజేపీ మద్దతా..?
ఎన్నికల వేళ అభ్యర్థులు, పార్టీల చిత్రాలు విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. పార్టీలు, సిద్ధాంతాలు పక్కన పెట్టుకొని స్థానిక పరిస్థితులకు [more]
ఎన్నికల వేళ అభ్యర్థులు, పార్టీల చిత్రాలు విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. పార్టీలు, సిద్ధాంతాలు పక్కన పెట్టుకొని స్థానిక పరిస్థితులకు [more]
ఎన్నికల వేళ అభ్యర్థులు, పార్టీల చిత్రాలు విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయాలు చిత్రంగా ఉంటాయి. పార్టీలు, సిద్ధాంతాలు పక్కన పెట్టుకొని స్థానిక పరిస్థితులకు తగ్గట్లుగా పొత్తు పెట్టుకుంటారు. ఇటువంటి పొత్తులే తుంగతుర్తి నియోజకవర్గం పెట్టుకున్నారు. తుంగతుర్తి జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏకంగా కాంగ్రెస్ అంటే ఏ మాత్రం పొసగని బీజేపీ మద్దతు ఇచ్చింది. ఇక, తుంగతుర్తి – 1 ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థికి క్విడ్ ప్రో కో కింద కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అంతేకాదు ఉమ్మడిగా రెండు పార్టీల పోస్టర్లు కూడా దర్శనమిస్తున్నాయి. ఈ పోస్టర్లలో కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోటోలు పక్కపక్కనే ఉండటం గమనార్హం. బలంగా ఉన్న టీఆర్ఎస్ ను ఎదుర్కునేందుకు ఈ రెండు పార్టీలు ఇక్కడ పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.