సచివాలయం వద్ద ఉద్రిక్తత.. రాజధాని రైతులు?

రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 మంది గ్రామాల రైైతులు ఆందోళనకు దిగారు. నేడు అమరావతి ప్రాంతంలో బంద్ కొనసాగుతోంది. నిరసనగా ర్యాలీగా ఏపీ సెక్రటేరియట్ వెళ్లేందుకు రైతులు [more]

Update: 2019-12-19 06:09 GMT

రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 మంది గ్రామాల రైైతులు ఆందోళనకు దిగారు. నేడు అమరావతి ప్రాంతంలో బంద్ కొనసాగుతోంది. నిరసనగా ర్యాలీగా ఏపీ సెక్రటేరియట్ వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాము త్వరలోనే గవర్నర్ ను కలసి తమ బాధలను చెప్పుకుంటామని, అవసరమతే ఢిల్లీ వెళ్లి మోదీని కలుస్తామని రైతుల చెబుతున్నారు. రైతులను మోసం చేసినందుకు జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆందోళన కారులతో కలసి ధర్నా చేస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సచివాలయానికి వెళ్లే రాహదారిపై రైతుల ఆందోళనతో ట్రాఫిక్ స్థంభించింది. జగన్ మూడు రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News