మేం బతకలేం.. చావనివ్వండి

రాజధాని అమరావతి రైతులు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు లేఖలు రాశారు. తాము మరణించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న [more]

Update: 2020-01-01 02:40 GMT

రాజధాని అమరావతి రైతులు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ కు లేఖలు రాశారు. తాము మరణించడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయన్నారు. అధికారంలోకి వచ్చిన జగన్ మాట తప్పారని, రాజధానిని అమరావతి నుంచి మారుస్తుండటంతో తమ జీవితాలు ఇక బాగుపడవని, తమకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. రాజధానిని క్రమంగా విశాఖకు తరలించే కుట్రను జగన్ చేస్తున్నారని, రాష్ట్రం కోసం తాము త్యాగం చేసి భూములిచ్చినా తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ త్యాగాలను గుర్తించకపోవడం పక్కన పెడితే హేళన చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News