జగన్ ప్రకటనతో రాజధాని రైతులు?
జగన్ మూడు రాజధానులు ప్రకటనతో రాజధాని ప్రాంత రైతులు ఆందోళన కల్గిస్తుంది. ఈ ప్రాంత ప్రజలు ఉదయాన్నే రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగారు. రాజధానిని ఇక్కడే [more]
జగన్ మూడు రాజధానులు ప్రకటనతో రాజధాని ప్రాంత రైతులు ఆందోళన కల్గిస్తుంది. ఈ ప్రాంత ప్రజలు ఉదయాన్నే రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగారు. రాజధానిని ఇక్కడే [more]
జగన్ మూడు రాజధానులు ప్రకటనతో రాజధాని ప్రాంత రైతులు ఆందోళన కల్గిస్తుంది. ఈ ప్రాంత ప్రజలు ఉదయాన్నే రోడ్డు మీదకు వచ్చి ఆందోళనకు దిగారు. రాజధానిని ఇక్కడే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ ప్రాంత భూములను ఉచితంగా ఇచ్చి తాము చేసిన త్యాగాలకు జగన్ అర్థం లేకుండా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఆరు నెలల తర్వాత ఇక్కడ రాజధాని లేదంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రాజధాని లేదంటే తమ భూములను తమకు యధాతధంగా ఇచ్చేయాలని వారు కోరుతున్నారు. రైతుల ఆందోళనతో భారీ ఎత్తున ట్రాఫిక్ స్థంభించింది. రాజధానిని ఇక్కడే కొనసాగించాలని వారు కోరుతున్నారు. పురుగు మందుల డబ్బాలతో వారు ఆందోళనకు దిగారు. రాజధానిని ఇక్కడ నిర్మించకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు.