కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకాలు వేయాలని నిర్ణయించింది. మే 1వ తేదీ నుంచి ఈ [more]

Update: 2021-04-20 01:13 GMT

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ టీకాలు వేయాలని నిర్ణయించింది. మే 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం దీనిని మూడో దశగా చెబుతోంది. కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటి వరకూ 45 సంవత్సరాలు దాటిన వారికే టీకాను ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News