దీక్ష ఖ‌ర్చు 10 కోట్లు కాదు… 2.83 కోట్లే…!!

ఢిల్లీలో ధ‌ర్మ‌పోరాట దీక్ష‌కు రూ.10 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని జ‌రుగుతున్న‌ ప్ర‌చారాన్ని ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. ధ‌ర్మ‌పోరాట దీక్ష‌పై క్యాబినెట్ భేటీలో చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌తిప‌క్షాలు [more]

Update: 2019-02-13 07:42 GMT

ఢిల్లీలో ధ‌ర్మ‌పోరాట దీక్ష‌కు రూ.10 కోట్లు ఖ‌ర్చు పెట్టామ‌ని జ‌రుగుతున్న‌ ప్ర‌చారాన్ని ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఖండించారు. ధ‌ర్మ‌పోరాట దీక్ష‌పై క్యాబినెట్ భేటీలో చ‌ర్చ జ‌రిగింది. ప్ర‌తిప‌క్షాలు కావాల‌నే త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని, ఢిల్లీ దీక్ష‌కు 10 కోట్లు కేటాయించినా కేవ‌లం 2.83 కోట్లు మాత్ర‌మే ఖ‌ర్చ‌య్యింద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. తాను వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాల కోసం దీక్ష చేయ‌లేద‌ని, రాష్ట్రం కోస‌మే దీక్ష చేశాన‌ని పేర్కొన్నారు. హోదా కోసం దీక్ష ద్వారా ఢిల్లీని క‌దిలించామ‌న్నారు. గ‌తంలో న‌రేంద్ర మోడీ దీక్ష కోసం రూ.1.80 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని ఆయ‌న గుర్తు చేశారు.

Tags:    

Similar News