జగన్ మరింత ఏడిపించేస్తున్నాడుగా?

మూడు రాజధానులు వద్దు, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత నాయకుల చేత చంద్రబాబు బలవంతంగా చెప్పించవచ్చు

Update: 2021-11-23 02:35 GMT

చంద్రబాబు ఓల్డ్ ఏజ్.. ఓల్డ్ స్ట్రాటజీస్... జగన్ జమానాలో అవి వర్క్ అవుట్ అయ్యేలా లేవు. చంద్రబాబును జగన్ ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇస్తున్నట్లు లేదు. ఇక మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేసినట్లు అసెంబ్లీలో జగన్ ప్రకటించినప్పటికీ కొత్త చట్టాన్ని తెచ్చిన తర్వాత దానిపై పోరాడాల్సి ఉంటుంది. మూడు ప్రాంతాలకు న్యాయం చేస్తూ తాను బిల్లులు తెచ్చానని జగన్ మరోసారి చెప్పుకునే వీలుంది.

అమరావతిని రాజధానిగా....
అదే సమయంలో చంద్రబాబు మరోసారి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరాల్సి ఉంటుంది. ఇది చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికరమే. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు ఒక్క రాజధాని ప్రాంతానికే సపోర్టు చేసే అవకాశాలుండవు. ఎందుకంటే మిగిలిన ప్రాంతాల్లోనూ పార్టీ గెలవాల్సి ఉంటుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పార్టీ ఇప్పటికే బలహీనంగా ఉంది.
వద్దంటే....
ఈ సమయంలో మూడు రాజధానులు వద్దు, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత నాయకుల చేత చంద్రబాబు బలవంతంగా చెప్పించవచ్చేమో గాని, జనం మెప్పును పొందలేరు. ఎవరికైనా తమ ప్రాంతానికి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారనిపిస్తుంది. అదే జరిగితే చంద్రబాబుకు మరోసారి ఎన్నికల్లో తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అలాగని మూడు రాజధానులను చంద్రబాబు సమర్థించ లేరు.
ఇబ్బందుల్లోకి నెట్టేదే....
దీతో జగన్ రాష్ట్రంలో తనపై ఉన్న కొద్దో గొప్పో వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు వీలుంటుంది. ఇక కులాలు, మతాల ఓట్ల గొడవ ఏపీలో ఎటూ ఉండనే ఉంటుంది. జగన్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చంద్రబాబును ఇబ్బందుల్లోకి నెట్టేదేనని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. జగన్ అన్నీ చూసుకునే ఈసారి గురి తప్పకుండా ఉండేందుకే చట్టాలను వెనక్కు తీసుకున్నారు. దీంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదు.


Tags:    

Similar News