ఎమ్మెల్యేలను తీసుకెళ్తే…. మా బలం మాకుంది
వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రలోభాలకు, బ్లాక్ మెయిలింగ్ చేసి ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుంటున్నారన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ [more]
;
వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రలోభాలకు, బ్లాక్ మెయిలింగ్ చేసి ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుంటున్నారన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ [more]
వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రలోభాలకు, బ్లాక్ మెయిలింగ్ చేసి ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుంటున్నారన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీకి మద్దతు పలకడంతో చంద్రబాబు విశాఖ జిల్లా నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి వ్యతిరేకతను మళ్లించడానికే ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యేలు పోయినా ప్రజలు, క్యాడర్ టీడీపీ వైపే ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. నాయకులు, కార్యకర్తలు కలసి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.