శారదాపీఠంలో క్షుద్రపూజలు జరుగుతున్నాయి.. బాంబు పేల్చిన బాబు
స్వరూపానందేంద్ర స్వామిజీ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. దొంగస్వామి చేతుల్లో రాష్ట్రం చీకట్లోకి నెట్టివేయబడుతుందన్నారు. ముఖ్యమంత్రి శారదాపీఠం వెళ్లి వచ్చిన వెంటనే డీజీపీ కూడా [more]
;
స్వరూపానందేంద్ర స్వామిజీ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. దొంగస్వామి చేతుల్లో రాష్ట్రం చీకట్లోకి నెట్టివేయబడుతుందన్నారు. ముఖ్యమంత్రి శారదాపీఠం వెళ్లి వచ్చిన వెంటనే డీజీపీ కూడా [more]
స్వరూపానందేంద్ర స్వామిజీ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. దొంగస్వామి చేతుల్లో రాష్ట్రం చీకట్లోకి నెట్టివేయబడుతుందన్నారు. ముఖ్యమంత్రి శారదాపీఠం వెళ్లి వచ్చిన వెంటనే డీజీపీ కూడా అక్కడకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. దుర్గగుడిలో ఏసీబీ సోదాలు జరిగితే ఈవో శారదాపీఠాన్ని ఆశ్రయించారన్నారు. ఈ స్వామీజీకి ఏం శక్తులున్నాయని ప్రశ్నించారు. శారదాపీఠంలో క్షుద్రపూజలు జరుగుతన్నాయన్నారు. తమను చంపేందుకు స్వామీజీ క్షుద్రపూజలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. స్వాములంటే సర్వం త్యాగం చేయాలని, భోగాలు అనుభవించేవాళ్లు స్వాములేంటని చంద్రబాబు ప్రశ్నించారు. దొంగస్వామి చేతుల్లో ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర భవిష్యత్ ను పెట్టారన్నారు చంద్రబాబు.