కుప్పంకు చంద్రబాబు చేరుకోక ముందే?

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు ముందే అక్కడ పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. కుప్పంలో టీడీపీ ఓటమికి కారణం నియోజవకర్గం ఇన్ ఛార్జి [more]

;

Update: 2021-02-24 02:29 GMT

కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనకు ముందే అక్కడ పార్టీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. కుప్పంలో టీడీపీ ఓటమికి కారణం నియోజవకర్గం ఇన్ ఛార్జి మునిరత్నం, పీఏ మనోహర్ లేనని స్థానిక నాయకులు మండి పడుతున్నారు. కుప్పం వచ్చిన వారిని స్థానిక నేతలు అడ్డుకున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఓటమిని తాము జీర్ణించుకోలేకపోతున్నామని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కుప్పం టీడీపీ ఇన్ ఛార్జి మునిరత్నం రాజీనామాకు సిద్ధమయ్యారు. అయితే కొందరు నేతలు సముదాయించడంతో ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. చంద్రబాబు ఈనెల 25వ తేదీన కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో నేతల మధ్య విభేదాలు చర్చనీయాంశమయ్యాయి.

Tags:    

Similar News