కేశినేని నాని లేకుండానే చంద్రబాబు రోడ్ షో
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని లేకుండానే చంద్రబాబు విజయవాడలో రోడ్ షోను ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని దర్గా సెంటర్ నుంచి సితార సెంటర్ వరకూ [more]
;
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని లేకుండానే చంద్రబాబు విజయవాడలో రోడ్ షోను ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని దర్గా సెంటర్ నుంచి సితార సెంటర్ వరకూ [more]
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని లేకుండానే చంద్రబాబు విజయవాడలో రోడ్ షోను ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని దర్గా సెంటర్ నుంచి సితార సెంటర్ వరకూ ఈ రోడ్ షో సాగింది. ఈ రోడ్ షోలో టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత మాత్రమే పాల్గొన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ లు పాల్గొన్నారు. కేశినేని నాని వెంట ఉంటే తాము చంద్రబాబు రోడ్ షోలలో పాల్గొనబోమని నిన్న బుద్దా వెంకన్న, నాగుల్ మీరా, బోండా ఉమ అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో కేశినేని నాని రోడ్ షోలో పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.