రెండున్నరేళ్లు అయింది జగన్.. ఇక కాస్కో
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పద్ధతి మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ను [more]
;
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పద్ధతి మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ను [more]
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పద్ధతి మార్చుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ను పరామర్శించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నేతలను అక్రమ అరెస్ట్ లు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కానీ కేసులకు టీడీపీ నేతలు భయపడిపోరన్నారు. ఒక ఉన్మాదికి పోలీసులు సహకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రెండున్నరేళ్లు అయిపోయిందని, రాబోయే రోజుల్లో మీరే చూస్తారని, అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు పక్కాగా తేలుస్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పులివెందుల పంచాయతీని రాష్ట్ర వ్యాప్తంగా జగన్ విస్తరించారని చంద్రబాబు అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారన్నారు. కోర్టు అక్షింతలు వేసినా బుద్ధి రావడం లేదన్నారు. సర్పంచ్ లందరూ రాజకీయాలకతీతంగా హక్కులను కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. సర్పంచ్ లకు టీడీపీ అండగా ఉంటుందన్నారు.