నిమ్మగడ్డకు చంద్రబాబు రెండు లేఖలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రెండు లేఖలు రాశారు. నాలుగోదశ పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులను ప్రకటించకుండా ఫలితాలను [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రెండు లేఖలు రాశారు. నాలుగోదశ పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులను ప్రకటించకుండా ఫలితాలను [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రెండు లేఖలు రాశారు. నాలుగోదశ పంచాయతీ ఎన్నికలలో అభ్యర్థులను ప్రకటించకుండా ఫలితాలను తారుమారు చేస్తున్నారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. రాత్రి పది గంటల వరకూ కూడా నలభైశాతం ఫలితాలను ప్రకటించలేదని చెప్పారు. టీడీపీ మద్దతు దారులకు మెజారిటీ ఉన్నప్పటికీ రీకౌంటింగ్ చేశారని, వైసీపీ నేతలతో అధికారులు కుమ్మక్కై ఫలితాలను తారుమారు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు ఎస్ఈసీకి చంద్రబాబు రెండు లేఖలు రాశారు.