ప్రచారానికి రెడీ అవుతున్న చంద్రబాబు…వచ్చే నెల 1 నుంచి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సివల్ ఎన్నికల ప్రచారానికి సమయాత్తమయ్యారు. మార్చి 1వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లనున్నారు. రాష్ట్రంలో 75 [more]

;

Update: 2021-02-23 01:02 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మున్సివల్ ఎన్నికల ప్రచారానికి సమయాత్తమయ్యారు. మార్చి 1వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు వెళ్లనున్నారు. రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్ లకు ఎన్నికలు వచ్చే నెల 10వ తేదీన జరగనున్నాయి. చంద్రబాబు ఒకే రోజు రెండు, మూడు కార్పొరేషన్ ల పరిధిలో ప్రచారం నిర్వహించేలా పార్టీ ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసింది. సుదీర్ఘకాలం తర్వాత చంద్రబాబు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

Tags:    

Similar News