కుప్పానికి చంద్రబాబు.. క్యాడర్ లో ధైర్యం నింపే యత్నం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చంద్రబాబు ఈ నెల 25వ తేదీ నుంచి 27 వరకూ అక్కడ పర్యటిస్తారు. శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం, [more]
;
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చంద్రబాబు ఈ నెల 25వ తేదీ నుంచి 27 వరకూ అక్కడ పర్యటిస్తారు. శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం, [more]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. చంద్రబాబు ఈ నెల 25వ తేదీ నుంచి 27 వరకూ అక్కడ పర్యటిస్తారు. శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం, కుప్పం ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కుప్పంలో దారుణ ఓటమిని చవి చూసింది. 89 పంచాయతీలకు గాను కేవలం 14 పంచాయతీల్లోనే విజయం సాధించింది. శాసనసభ ఎన్నికల తర్వాత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించలేదు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు కుప్పం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.