బాబు పర్యటన లో ఉత్కంఠ తప్పదా?
చంద్రబాబు విజయవాడ పర్యటన సజావుగా సాగుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. కేశినేని నానిపై ఇప్పటికే నగర నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు తన పక్కన ఎంపీ లేకుండా [more]
;
చంద్రబాబు విజయవాడ పర్యటన సజావుగా సాగుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. కేశినేని నానిపై ఇప్పటికే నగర నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు తన పక్కన ఎంపీ లేకుండా [more]
చంద్రబాబు విజయవాడ పర్యటన సజావుగా సాగుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. కేశినేని నానిపై ఇప్పటికే నగర నేతలు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు తన పక్కన ఎంపీ లేకుండా ప్రచారానికి రాలేరు. అలాగని కేశినేని నానిని వెంటపెట్టుకుని వస్తే టీడీపీ నేతలు గైర్హాజరవుతామని హెచ్చరించారు. అయితే కేశినేని శ్వేత నగరనేతలను కలిసి మద్దతు కోరినా కొంత పరిస్థితి సద్దుమణిగినట్లే కన్పించింది. అయినా బోండా ఉమ, బుద్దా వెంకన్న అనుచరులు నిలదీసే అవకాశముందని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు విజయవాడ నగర పర్యటనలో ఉత్కంఠత నెలకొంది.