ఢిల్లీలో చంద్ర‌బాబు పాద‌యాత్ర‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోరుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీలో పోరాటం కొన‌సాగిస్తున్నారు. ఆయ‌న ఇవాళ టీడీపీ నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో క‌లిసి ఏపీ భ‌వ‌న్ నుంచి [more]

Update: 2019-02-12 06:04 GMT

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా కోరుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీలో పోరాటం కొన‌సాగిస్తున్నారు. ఆయ‌న ఇవాళ టీడీపీ నేత‌లు, ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో క‌లిసి ఏపీ భ‌వ‌న్ నుంచి జంత‌ర్ మంత‌ర్ వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ కు కూడా పాద‌యాత్ర‌గా వెళ్లి రాష్ట్ర‌ప‌తిని క‌ల‌వ‌నున్నారు. 18 అంశాల‌తో కూడిన విన‌తిప‌త్రాన్ని ఆయ‌న రాష్ట్ర‌ప‌తికి స‌మ‌ర్పించ‌నున్నారు. చంద్ర‌బాబు పాద‌యాత్ర‌కు పెద్ద ఎత్తున టీడీపీ నేత‌లు హాజ‌ర‌య్యారు. మోడీకి వ్య‌తిరేకంగా ఢిల్లీ వీధుల్లో నినాదాలు చేశారు. దేశ్ కి నేత చంద్ర‌బాబు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాద‌యాత్ర ముందుకు సాగుతోంది.

Tags:    

Similar News