కథ కంచి కి "బాబు జైల్ కి"

ఆంద్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి అవినితీ నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు 14 రోజుల (ఈ నెల 22 వరకు) రిమాండ్‌ విధించింది. ఆదివారం ఉదయం సీబీఐ కోర్టులో చంద్రబాబును ప్రవేశ పెట్టిన తర్వాత సాయంత్రం వరకూ వాదనలు విన్న న్యాయమూర్తి సీఐడీ అధికారుల వాదనతో ఏకీభవించారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సుధీర్‌ లూథ్రా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు.

Update: 2023-09-10 14:10 GMT

రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించడానికి అధికారుల సన్నాహాలు

ఆంద్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి అవినితీ నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు 14 రోజుల (ఈ నెల 22 వరకు) రిమాండ్‌ విధించింది. ఆదివారం ఉదయం సీబీఐ కోర్టులో చంద్రబాబును ప్రవేశ పెట్టిన తర్వాత సాయంత్రం వరకూ వాదనలు విన్న న్యాయమూర్తి సీఐడీ అధికారుల వాదనతో ఏకీభవించారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది సుధీర్‌ లూథ్రా సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. సాంకేతిక కారణాలను చూపిస్తూ... రిమాండ్‌ను తిరస్కరించాలని, చంద్రబాబును విడుదల చేయాలని వాదించారు. ఆయన చెప్పిన సాంకేతిక కారణాలకు సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి కౌంటర్‌ ఆర్గ్యుమెంట్లు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌ చేశారు. ఈ కేసుపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు రిమాండ్‌ను తిరస్కరిస్తారని తెలుగుదేశం నాయకులు భావించారు. కానీ అనూహ్యంగా ఆయనకు 14 రోజుల రిమాండ్‌ను విధిస్తూ తీర్పు వెలువడిరది. చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో శనివారం ఉదయం తెలుగుదేశం అధినేతను నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అక్కణ్నుంచి ఆయన కాన్వాయ్‌లోనే విజయవాడకు తరలించారు. ఈ రోజు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టారు.

Tags:    

Similar News