ప్రజలెవరూ బయటకు రావద్దు: వణికిపోతున్న చెన్నై
మండూస్ తుపాను తీరం దాటడంతో చెన్నై నగరం వణికిపోయింది. ఈదురుగాలులతో విద్యుత్తు స్థంభాలు నేలకొరిగాయి.
మండూస్ తుపాను తీరం దాటడంతో చెన్నై నగరం వణికిపోయింది. ఈదురుగాలులతో విద్యుత్తు స్థంభాలు నేలకొరిగాయి. పెద్దచెట్లు విరిగిపడ్డాయి. కొన్ని వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలులకు దాదాపు రెండు వందల చెట్లు నేలకూలినట్లు అధికారులు గుర్తించారు. చెన్నై నగరంలో పలుచోట్ల హోర్డింగ్ లు ఊగిసిలాడుతుండటం, కొన్ని చోట్ల పడిపోవడంతో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈదురుగాలులతో...
ఈదురుగాలులతో పాటు భారీ వర్షం కూడా పడటంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. చెన్నై నగరంతో పాటు చెంగల్పట్ట జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. చెంగల్పట్టు జిల్లాలో 115 మి.మీ వర్షపాతం నమోదయినట్ల అధికారులు వెల్లడించారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. రైళ్లను కూడా ఆపేశారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోలు బంకులను కూడా మూసివేశారు. చెన్నై నగరంలో కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తుంది.