నూతన గవర్నర్ గా ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ ను ఇటీవల రాష్ట్రపతి ఏపీ గవర్నర్ గా నియమించిన సంగతి [more]

Update: 2019-07-24 06:07 GMT

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేశారు. ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్ ను ఇటీవల రాష్ట్రపతి ఏపీ గవర్నర్ గా నియమించిన సంగతి తెలిసిందే. బిశ్వభూషణ్ హరిచందన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఒడిశా బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బిశ్వభూషణ్ హరిచందన్ పనిచేశారు. తొమ్మిదేళ్ల పాటు ఒడిశా మంత్రిగా పనిచేశారు. న్యాయవిద్యను అభ్యసించిన బిశ్వభూషణ్ హరిచందన్ బీజేపీలో కీలకనేతగా ఎదిగారు. జనసంఘ్ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది. బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, మంత్రులు హాజరయ్యారు.

Tags:    

Similar News