బ్రేకింగ్ : కరోనా పై తెలంగాణ ప్రభుత్వం హైఅలెర్ట్
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయమే హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసు ఒకటి వచ్చిందన్నారు. [more]
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయమే హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసు ఒకటి వచ్చిందన్నారు. [more]
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయమే హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసు ఒకటి వచ్చిందన్నారు. దేశవ్యాప్తంగా 65 మంది కరోనా వైరస్ బారిన పడగా పది మంది దాని నుంచి బయటపడ్డారన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో రోజుకు 55 వేల మంది ప్రయాణికులు వస్తున్నారన్నారు. ఎయిర్ పోర్టులో రద్దీ విపరీతంగా పెరిగిందన్నారు. కరోనా వైరస్ మృతులు మనదేశంలో ఇద్దరే అని చెప్పారు. చైనా, సౌత్ కొరియా, ఇరాన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాల్లోనే ఈ వైరస్ ఉంది. హైదరాబాద్ మెట్రోలో కూడా ప్రయాణికులు గణనీయంగా పెరిగారన్నారు. రోజుకు నాలుగు లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారన్నారు. వందేళ్ల క్రితం వచ్చిన వ్యాధితో ప్రపంచ వ్యాప్తంగా కోటి నాలుగు లక్షల మంది చనిపోయారన్నారు.
సాయంత్రం కేబినెట్ భేటీలో…..
ఇతర రాష్ట్రాల్లో కూడా దీనిపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదం లేకపోయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలన్న దానిపై హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. హైలెవల్ కమిటీ రిపోర్ట్ పై ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వ్యాధి ఎక్కువగా ప్రబలితే ఏం చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమయితే ఐదు వేల కోట్లను ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. తెలంగాణలో స్కూళ్లు, కళాశాలలు, షాపింగ్ మాల్స్, సినిమాహాళ్లు మూసివేసే అవకాశం కన్పిస్తుంది.