సాయిరెడ్డికి కీలక బాధ్యతలు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ కీలక బాధ్యతలను అప్పగించారు.
విజయవాడ : వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ముఖ్యమంత్రి జగన్ కీలక బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి వరకూ జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. విజయసాయిరెడ్డిని జగన్ పెట్టారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. నెంబరు 2 స్థానంలో ఉండాల్సిన విజయసాయిరెడ్డిని కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకే పరిమితం చేశారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే అనూహ్యంగా విజయసాయిరెడ్డికి జగన్ కీలక బాధ్యతలను అప్పగించారు. ఎన్నికలు ఇంకా రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలో ఆయన ప్రాధాన్యత ఏమిటో ఈ బాధ్యతలను అప్పగించడం చూస్తేనే అర్థమవుతుంది.
అనుబంధ విభాగాల....
వైసీపీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జిగా విజయసాయరెడ్డిని జగన్ నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. వైసీపీకి చెందిన యువత, విద్యార్థి, మహిళ విభాగాలకు మాత్రమే కాకుండా సోషల్ మీడియా వింగ్ కు కూడా విజయసాయిరెడ్డి ఇన్ ఛార్జిగా వ్యవహరించనున్నారు. తనకు కీలక బాధ్యతలను అప్పగించడం పట్ల జగన్ కు విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.