ఏప్రిల్ లోనే అభ్యర్థుల ప్రకటన : జగన్
గడప గడపకు ప్రభుత్వం కార్కక్రమంలో 32 మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు
గడప గడపకు ప్రభుత్వం కార్కక్రమంలో 32 మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. మార్చి నెలాఖరులోగా పనితీరు మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారి పనితీరును జగన్ సమావేశంలో వివరించడంతో వారు కూడా అవాక్కయ్యారని తెలిసింది.
32 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్
పనితీరు మార్చుకోకుంటే మరో అభ్యర్థిని తాము నిర్ణయిస్తామని జగన్ గట్టిగానే హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. తీరు ఏమాత్రం మార్చుకోకపోయినా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ తేల్చిచెప్పినట్లు తెలిసింది. ఇందులో ఎలాంటి మొహమాటం పడబోమని కూడా ఆయన చెప్పారని తెలిసింది. మళ్లీ ఏప్రిల్ నెలలో వర్క్ షాప్ ను నిర్వహిస్తానని, అప్పుడు అభ్యర్థును తాను ప్రకటిస్తానని జగన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంటున్నారు. వందరోజుల్లో పనితీరు మార్చుకోవాలని జగన్ వారికి కొంత గడవు ఇచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.