ఎవరికీ అన్యాయం జరగకుండా నిర్ణయం

రెండు మూడురోజుల్లో పీఆర్సీపై స్పష్టత ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు.

Update: 2022-01-06 12:55 GMT

రెండు మూడురోజుల్లో పీఆర్సీపై స్పష్టత ఇస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. ఉద్యోగులకు చేయగలిగినంత చేస్తామని చెప్పారు. గత రెండేళ్లలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిందని చెప్పారు. నవంబరు కన్నా డిసెంబర్ లో ఆదాయం తగ్గిందని చెప్పారు. జీతాలు, పింఛన్ల కోసం నెలకు 67,430 కోట్లు ఖర్చు చేస్తున్నామని జగన్ చెప్పారు. ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని జగన్ తెలపారు.

మోయలేని భారమే...
కాంటాక్ట్ ఉద్యోగులకు ఇప్పటికే టైం స్కేల్ ను అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై మోయలేని భారం మోపవద్దు అని జగన్ కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణతో పోల్చుకోవద్దని ఉద్యోగులను జగన్ కోరారు. తెలంగాణ ఆదాయం మనకు రావడం లేదు కదా? అని ప్రశ్నించారు. ఎవరికీ అన్యాయం జరగకుండా నిర్ణయం ఉంటుందని జగన్ తెలిపారు. తెలంగాణలో జీతాలు, పింఛన్లు 22,680 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఏపీ 36 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. ఆదాయం తగ్గుతున్న సమయంలో భారం మోపడం మంచిది కాదన్నారు. వాస్తవాలను గుర్తించాలని జగన్ కోరారు.


Tags:    

Similar News