హుజూర్ నగర్ కు వరాలు

హుజూర్ నగర్ లో సీఎం ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. నీళ్లేదో పాలేదో తెలుసుకుని ఉప ఎన్నికలో సైదిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారని, అదే ఉత్సాహంతో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా [more]

Update: 2019-10-26 12:23 GMT

హుజూర్ నగర్ లో సీఎం ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు. నీళ్లేదో పాలేదో తెలుసుకుని ఉప ఎన్నికలో సైదిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారని, అదే ఉత్సాహంతో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా సేవలందిస్తారన్నారు కేసీఆర్. ఇక మీకు నిజమైన హుజూర్ వస్తుందన్నారు. 134 గ్రామ పంచాయితీలకు 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి నిధి నుంచి వెంటనే ఈ నిధులు మంజూరు అవుతాయని చెప్పారు కేసీఆర్.

ఇక దుమ్ము, దూషణం కనిపించొద్దు…..

ఏడు మండల కేంద్రాల అభివృద్దికి ప్రతి మండల కేంద్రానికి 30 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు మున్సిపల్ పట్టణాలకు సీఎం నిధుల నుంచి 25 కోట్లు మంజూరు చేస్తానని, ఇకపై ఇక్కడి రోడ్లపై దుమ్ము, ధూళి లేకుండా చేస్తానన్నారు కేసీఆర్. అదే విధంగా నేరేడు చర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గిరిజనుల కోసం రెసిడెన్సియల్ పాఠశాల, బంజరా భవన్ నిర్మాణం చేస్తామని చెప్పారు సీఎం కేసీఆర్. ఎంతో కాలంగా మీరడుగుతున్న హుజూర్ నగర్ కు రెవెన్యూ డివిజన్ ను కూడా తెస్తామన్నారు. కేంద్రంతో మాట్లాడి హుజూర్ నగర్ కు ఈఎస్ఐ ఆసుపత్రి తీసుకురావడానికి కృషి చేస్తానన్నారు. పాలిటెక్నిక్ కాలేజీ, హుజూర్ నగర్ కు కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు సీఎం కేసీఆర్. ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్ రూంలు ఇస్తామన్నారు కేసీఆర్.

 

 

Tags:    

Similar News