కిడ్నాప్ వెనక భూమా అఖిలప్రియ భర్త?

సీఎం కేసీఆర్ బంధువులు ముగ్గురు కిడ్నాప్ కు గురయ్యారు. అయితే వారిని తిరిగి మై హోం అవతార్ వద్ద వదిలి వెళ్లారు. బోయినపల్లిలో ప్రవీణ్ రావు, నవీన్ [more]

;

Update: 2021-01-06 02:57 GMT

సీఎం కేసీఆర్ బంధువులు ముగ్గురు కిడ్నాప్ కు గురయ్యారు. అయితే వారిని తిరిగి మై హోం అవతార్ వద్ద వదిలి వెళ్లారు. బోయినపల్లిలో ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావును ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రాం సోదరుడు ఈ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ల్యాండ్ పత్రాలతో పాటు ల్యాప్ ట్యాప్ లను తీసుకుని ముగ్గురు వ్యక్తులను ఈ గ్యాంగ్ కిడ్నాప్ చేసింది. హఫీజ్ పేట లో ఉణ్న వందల కోట్ల విలువైన భూమి కోసం గత కొంత కాలంగా ఘర్షణ జరుగుతుంది. 40 ఎకరాల భూమని ఇందులో భూమా కుటుంబం కబ్జా చేసిందన్న ఆరోపణలున్నాయి. దీని వెనక భూమా అఖిలప్రియ భర్త ఉన్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News