వైసీపీ ఎమ్మెల్యే కన్పించడం లేదట
తాడేపల్లి వైైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కన్పించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉండవల్లి శ్రీదేవిని వెతికి పెట్టాలంటూ రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులు [more]
తాడేపల్లి వైైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కన్పించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉండవల్లి శ్రీదేవిని వెతికి పెట్టాలంటూ రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులు [more]
తాడేపల్లి వైైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కన్పించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఉండవల్లి శ్రీదేవిని వెతికి పెట్టాలంటూ రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులు పోలీసు స్టేషన్ సిబ్బందిని కోరారు. గత ఏడు రోజులుగా రాజధాని అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఈ ప్రాంత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి దీనిపై ఇంతవరకూ స్పందించలేదు. రైతులను పరామర్శించలేదు. దీంతో రైతులు, మహిళలు ఉండవల్లి శ్రీదేవి కన్పించడం లేదంటూ ఫిర్యాదు చేశారు.