ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్వాగతం..?

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు గానూ [more]

;

Update: 2019-01-01 08:21 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో ఇవాళ ముగ్గురు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు గానూ కేసీఆర్ ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్లనున్నారు. ఆయనకు జిల్లాలోని ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, సీతక్క స్వాగతం పలకనున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారి జిల్లాకు వస్తున్నందున మర్యాదపూర్వకంగానే స్వాగతం పలుకుతున్నాని, జిల్లా ప్రజల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యేలు తెలిపారు. తాము పార్టీ మారే ప్రశ్నే ఉండదని, ప్రతిపక్షం పాత్ర పోషిస్తూనే ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని వారు పేర్కొన్నారు.

Tags:    

Similar News