కరోనా కట్టడిలో ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై హైకోర్టుకు నివేదికను ప్రభుత్వం సమర్పించింది. మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు, థియేటర్లపై [more]

Update: 2021-04-07 00:35 GMT

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై హైకోర్టుకు నివేదికను ప్రభుత్వం సమర్పించింది. మద్యం దుకాణాలు, బార్లు, పబ్ లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని హైకోర్టు కోరింది. ఆర్ టీపీసీఆర్ పరీక్షలు అతి తక్కువగా చేస్తున్నారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం పూర్తిగా రాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టిందని హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్టీ పీసీఆర్ పరీక్షలు 10 శాతం కూడా లేవని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తోందని, ఇంకా నెమ్మదిగా పెంచడమేంటన్న హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పాజిటివ్, మరణాల రేటును వెల్లడించాలని హైకోర్టు తెలిపింది.

Tags:    

Similar News